ఇన్వెస్టర్లను ముంచేది దురాశే!

ఇన్వెస్టర్లను ముంచేది దురాశే!
  • మార్కెట్లో రిస్కును యాది మరుస్తున్నరు
  • ఈక్విటీ అంటే ప్రాఫిట్స్ అని అనుకుంటున్నారు
  •  లోకల్‌‌‌‌గా పరిస్థితులు పాజిటివ్‌‌‌‌గా ఉన్నాయి
  •  మార్కెట్లు పడడానికి గ్లోబల్‌‌‌‌ సెంట్రల్ బ్యాంకులే కారణమవుతాయి
  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌‌‌‌ మ్యూచువల్ ఫండ్ సీఐఓ ఎస్‌‌‌‌ నరేన్‌‌‌‌

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు:దురాశ దు:ఖానికి చేటు అంటారు. ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితులను చూస్తుంటే దురాశనే ఇన్వెస్టర్లకు పెద్ద సమస్యగా మారుతుందని  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌‌‌‌ మ్యూచువల్ ఫండ్ సీఐఓ ఎస్ నరేన్‌‌‌‌ ఈటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మాక్రో ఎకానమీలో లేదా బిజినెస్‌‌‌‌ సైకిల్‌‌‌‌లో ఎటువంటి సమస్యలు కనిపించడం లేదని పేర్కొన్నారు. కొత్త ఇన్వెస్టర్లకు కేవలం ఈక్విటీ మార్కెట్స్ మాత్రమే కనిపిస్తున్నాయని, రిస్క్ అనే పదమే వీరికి తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. స్టాక్‌‌‌‌ మార్కెట్స్‌‌‌‌కు సంబంధించిన మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే..1993–94 టైమ్‌‌‌‌లో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు ఆకర్షితులయ్యారు. ఈక్విటీ అంటే కేవలం ప్రాఫిట్సే అనే స్టేజ్‌‌‌‌కు వెళ్లిపోయారు. ప్రస్తుత బుల్‌‌‌‌ మార్కెట్ చూస్తుంటే అప్పటి పరిస్థితులే  గుర్తుకొస్తున్నాయి. మేము ఇతరుల డబ్బులను మేనేజ్ చేసేటప్పుడు రిస్క్‌‌‌‌ను  దృష్టిలో పెట్టుకుంటాం. రిస్క్‌‌‌‌ ఉంటుందని మర్చిపోకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లపై నెగెటివ్ ప్రభావం చూపే అంశాలు ఏవీ కనిపించడం లేదు. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాని ప్రభుత్వం చాలా చక్కగా ఈ పరిస్థితులను కంట్రోల్ చేస్తోంది. లోకల్‌‌‌‌గా ఎటువంటి  సమస్యలు లేవు కేవలం ఇన్వెస్టర్ల దురాశ తప్ప. యూఎస్‌‌‌‌లో 2012 నుంచి 2018 వరకు బుల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కొనసాగింది. కేవలం ఇన్వెస్ట్ చేయడమే తప్ప మార్కెట్ కరెక్ట్ అవుతుందనే ఆలోచన కూడా  అక్కడి ఇన్వెస్టర్లకు రాలేదు. కానీ, 2018 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో, 2020 మార్చిలో అతిపెద్ద మార్కెట్ కరెక్షన్లు వచ్చాయి. ఇన్వెస్టర్ల దురాశనే పెద్ద సమస్య అని మరిచిపోకూడదు.
మార్కెట్ పడడానికి ఒక ట్రిగ్గర్‌‌‌‌‌‌‌‌ కావాలి..
ఐఎల్‌‌‌‌ అండ్ ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌, డీహెచ్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌ సంఘటనలు బయటపడనంత వరకు ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ బూమ్‌‌‌‌ కొనసాగింది. ప్రతిసారీ వాల్యుయేషన్ సైకిల్ బ్రేక్ అవ్వాలంటే ఏదో ఒక ఇష్యూ ట్రిగ్గర్‌‌‌‌‌‌‌‌లా పనిచేయాలి. ఈ సారి ఇలాంటి ట్రిగ్గర్ లోకల్‌‌‌‌గా కాకుండా గ్లోబల్ అంశాల వలనే వస్తుంది. 2017 టైమ్‌‌‌‌లో స్మాల్‌‌‌‌ క్యాప్, మిడ్‌‌‌‌ క్యాప్ షేర్లు లార్జ్‌‌‌‌ క్యాప్ షేర్లను మించి పెర్ఫార్మ్‌‌‌‌ చేస్తాయని అంచనా వేసేవారు.  కొన్ని ట్రిగ్గర్ల వలన ఆ అంచనాలు తప్పాయి. ప్రస్తుత మార్కెట్‌‌‌‌లో కనిపిస్తున్న బుల్ రన్‌‌‌‌  గ్లోబల్ సెంట్రల్‌‌‌‌ బ్యాంకుల వలన స్టార్టయ్యింది. ఈ బుల్‌‌‌‌ రన్‌‌‌‌ గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వలనే బ్రేక్ అవుతుంది.  ఇప్పటికే సైడ్ ఎఫెక్ట్స్ చూడొచ్చు.  అన్ని కమోడిటీల ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు ప్రింట్ చేస్తున్న 25 బిలియన్ డాలర్లపై పడుతుంది. ఏదో ఒకరోజు మార్కెట్లకు నెగిటివ్ అయినా ఈ బ్యాంకులు నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆ పరిస్థితులు మార్కెట్లు పడడానికి ట్రిగ్గర్లుగా పనిచేస్తాయి. మార్కెట్ల వాల్యుయేషన్ ఎక్కువగానే ఉంది. దానర్ధం మార్కెట్లు తిరిగి రివర్స్ అవుతాయనే! ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పదు.  ఈ నిర్ణయాలన్నీ గ్లోబల్‌‌గా సెంట్రల్‌‌‌‌ బ్యాంకులే తీసుకుంటాయి. మనం ఈ నిర్ణయాలకు బాధితులుగా మిగిలిపోతాం. ఈ విషయంపై క్లారిటీగా ఉన్నా. కానీ, ఈ పరిస్థితులు ఎప్పుడు వస్తాయనేది గ్లోబల్​ సెంట్రల్​ బ్యాంకులపైనే ఆధారపడి ఉంటుంది.
మార్కెట్లు క్రాష్‌‌‌‌..
మార్కెట్లు బుధవారం నష్టాల్లో క్లోజయ్యాయి. ఇన్వెస్టర్లు వరసగా రెండో సెషన్‌‌‌‌లోనూ ప్రాఫిట్‌‌‌‌ బుకింగ్‌‌‌‌కు మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీలు కీలక లెవెల్స్‌‌‌‌ను కోల్పోయాయి. సెన్సెక్స్‌‌‌‌ 456 పాయింట్లు ( 0.74 శాతం) పడి 61,260 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 152 పాయింట్లు (0.83 శాతం) తగ్గి 18,267 వద్ద ముగిసింది. మిడ్‌‌‌‌ క్యాప్‌‌‌‌, స్మాల్‌‌‌‌ క్యాప్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీ షేర్లు వరసగా రెండో సెషన్‌‌‌‌లోనూ భారీగా నష్టపోయాయి. ఈ షేర్లు బుధవారం సెషన్‌‌‌‌లో 19 శాతం పడి రూ. 4,415 వద్ద క్లోజయ్యాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ బుక్ చేస్తుండడంతో ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీ కౌంటర్‌‌‌‌‌‌‌‌లో బయ్యర్లే కరువయ్యారు. షేరు భారీగా పడుతుండడంతో ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీ ఎఫ్‌‌‌‌ అండ్ ఓ పై ఎక్స్చేంజిలు బ్యాన్ విధించాయి కూడా. ‘ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లో కనిపిస్తున్న కరెక్షన్ అర్థవంతమైందే. మార్కెట్లు ఓవర్ వాల్యూ అవ్వడంతో  సమీప కాలంలో  కరెక్షన్ కొనసాగొచ్చు. కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న రిఫార్మ్స్‌‌‌‌, చైనా స్ట్రాటజీల వలన దేశ కార్పొరేట్ కంపెనీలు భవిష్యత్‌‌‌‌లో లాభపడతాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ వినోద్ నాయర్ అన్నారు.  హాంకాంగ్‌‌‌‌, సియోల్‌‌‌‌, టోక్యో, షాంఘై మార్కెట్లు నష్టాల్లో క్లోజయ్యాయి. యూరప్ స్టాక్ ఎక్స్చేంజిలు మిశ్రమంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 47 పైసలు బలపడి 74.88 వద్ద సెటిలయ్యింది.