హైదరాబాద్, వెలుగు: డెలివరీల కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వాడడానికి బజాజ్ ఆటోతో ఫ్లిప్‌కార్ట్ పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదట వెయ్యి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గో బండ్లను ఫ్లిప్‌కార్ట్‌కు బజాజ్ ఆటో సప్లయ్ చేస్తుంది. ఫ్యూచర్‌లో మరిన్ని బండ్లను సప్లయ్ చేసే అవకాశం ఉంది. ఈ–కామర్స్ సెక్టార్ వేగంగా విస్తరిస్తుండడంతో లాజిస్టిక్స్ సెక్టార్ కూడా అంతే వేగంగా విస్తరిస్తోందని బజాజ్ ఆటో స్పోక్స్‌పర్సన్ సమర్దీప్ సుబంధ్ అన్నారు. రెండేళ్లలో వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ కార్గో వెహికల్స్‌ను సప్లయ్ చేస్తామని చెప్పారు. దేశంలోని ఈ–కామర్స్ సెక్టార్‌లో కీలకమైన మైలురాయిగా తమ పార్టనర్‌షిప్ నిలుస్తుందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రి పేర్కొన్నారు.
