- ప్రకటించిన కిచెన్ ఫర్నిచర్ కంపెనీ బ్లమ్
హైదరాబాద్, వెలుగు: ప్రతి జిల్లాలో తాము ఒక షోరూమ్‌ను తెరుస్తామని కిచెన్ ఫర్నీచర్ ఫిట్టింగ్ కంపెనీ బ్లమ్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన మొదటి ఎక్స్పీరియెన్స్సెంటర్ను ప్రారంభించిన తరువాత బ్లమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నదీమ్ పట్నీ ఈ విషయం చెప్పారు. ఈ సెంటర్లో అధునాతన డ్రాయర్ సిస్టమ్‌లు, హింజ్‌లు, లిఫ్ట్ సిస్టమ్‌లు ఉంటాయి. వాణిజ్యం, ఫర్నిచర్ పరిశ్రమ, ఇంటీరియర్ డిజైన్ విభాగంలో ఆసక్తిగా ఉన్న వినియోగదారులకు "మేడ్ ఇన్ ఆస్ట్రియా" ఫర్నిచర్ ఫిట్టింగ్‌లను అందిస్తోంది. బ్లమ్ అధిక- నాణ్యత ఫర్నీచర్ ఫిట్టింగ్‌లలో ప్రత్యేకత కలిగిన ఆస్ట్రియన్ హార్డ్‌వేర్ తయారీదారు అని నదీమ్ అన్నారు. కంపెనీకి ఆస్ట్రియాలోని వోరార్ల్‌బర్గ్‌లో ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయన్నారు.
