అజూర్​కు బై!.. కృత్రిమ్​కు వెల్​కమ్​​

అజూర్​కు బై!.. కృత్రిమ్​కు వెల్​కమ్​​
  •     ఓలా ఫౌండర్​ అగర్వాల్​ నిర్ణయం

న్యూఢిల్లీ: గ్లోబల్​ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌‌‌‌ఫాం అజూర్ నుంచి మొత్తం వర్క్​లోడ్​ను​ వచ్చే వారంలోగా కంపెనీ కృత్రిమ్​ క్లౌడ్‌‌‌‌కు తరలించాలని మొబిలిటీ కంపెనీ  ఓలా ఫౌండర్​, సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ఎంప్లాయ్​మెంట్​ సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫారమ్ లింక్డ్‌‌‌‌ఇన్ తన పోస్ట్‌‌‌‌ను తీసివేసినందుకు అగర్వాల్ గురువారం విమర్శలు చేశారు. పోస్ట్​తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ లింక్డ్​ఇన్​ దానిని తొలగించింది. లింక్డ్​ఇన్​ బాట్​లో అగర్వాల్​ తన గురించి ఒక ప్రశ్న అడిగారు.  

సమాధానం ఇచ్చేటప్పుడు ‘హీ’కి బదులు ‘దే’ (వాళ్లు) అనే ప్రొనౌన్​ వాడింది. లింక్డ్​న్​భాషను ‘ప్రొనౌన్​ ఇల్​నెస్​’గా అగర్వాల్​పేర్కొన్నారు. తరువాత వర్క్​లోడ్​ మార్పు నిర్ణయాన్ని ప్రకటించారు. భారతదేశం తన స్వంత టెక్  ఏఐని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.  అజూర్ నుంచి బయటకు వెళ్లాలనుకునే ఏ ఇతర డెవలపర్​కు అయినా, తాము పూర్తి సంవత్సరానికి ఉచిత క్లౌడ్ సర్వీసును ఇస్తామని ఆఫర్​ చేశారు.