గ్రూప్ 1 అప్లికేషన్ కు ఓటీఆర్ తప్పనిసరి

గ్రూప్ 1 అప్లికేషన్ కు ఓటీఆర్ తప్పనిసరి
  • ఈనెల 31 దాకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
  • అభ్యర్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న టీఎస్‌‌పీఎస్సీ
  • 8 నిమిషాల్లో దరఖాస్తు పూర్తవుతున్నట్లు వెల్లడి
  • ఈ నెల 31 దాకా దరఖాస్తులకు అవకాశం
  • అప్లికేషన్‌‌కు టీఎస్​పీఎస్సీ ఓటీఆర్ తప్పనిసరి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టులకు ఆన్‌‌లైన్​అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజైన సోమవారం సాయంత్రం 5 గంటల దాకా 3,895 మంది అప్లై చేసినట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అప్లికేషన్ల ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అనే వివరాలను అభ్యర్థుల నుంచి అధికారులు సేకరించారు. తొలిరోజు అప్లై చేసిన పది మంది అభ్యర్థులకు ఫోన్లు చేసి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తమకు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు ఎదురుకాలేదని, కేవలం 5 నుంచి 8 నిమిషాల్లో అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిందని అభ్యర్థులు చెప్పినట్టు టీఎస్‌‌పీఎస్సీ తెలిపింది. ఈనెల 31 దాకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని,  గ్రూప్ 1 అప్లికేషన్‌‌కు టీఎస్​పీఎస్సీ ఓటీఆర్ తప్పనిసరి.  మొత్తం 25 లక్షల మందిలో సోమవారం నాటికి 1,54,785 మంది మాత్రమే ఓటీఆర్ అప్​డేట్ చేసుకోగా, కొత్తగా 68,793 మంది ఓటీఆర్ క్రియేట్ చేసుకున్నారు.

దరఖాస్తు సమయంలో ఇవి ముఖ్యం

వెబ్‌‌సైట్‌‌లో అప్లికేషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే, క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ కన్పిస్తోంది. దీంట్లో టీఎస్​పీఎస్సీ ఐడీ, డేటాఫ్ బర్త్ ఎంటర్ చేస్తే, మొబైల్‌‌ నంబర్‌‌‌‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో గ్రూప్ 1 అప్లై, యూజర్ గైడ్ ఆప్షన్లుంటాయి. గ్రూప్1 అప్లైపై క్లిక్ చేసి కొన్ని వివరాలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది.
    

  • ఓటీఆర్ వివరాలు కరక్టేనా?
  • ఇండియన్ సిటిజనేనా? తెలంగాణ వాసివేనా?
  • గ్రాడ్యుయేషన్ రిజల్ట్ డిక్లేర్ డేట్, ప్రిమిలినరీ ఎగ్జామ్ రాసే భాషను (ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ) ఎంచుకోవాలి.
  • మెయిన్ ఎగ్జామ్ ఏ భాషలో రాస్తారనే అంశాన్ని ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఒకటి ఎంచుకోవాలి.
  • పోస్టు కోడ్ 4, 8, 11, 16కు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నయా లేవా అనేది చెప్పాలి. ఉంటే వాటి గురించి చెప్పాలి.
  • ఎగ్జామ్ సెంటర్ కోసం 1 నుంచి 12 దాకా జిల్లాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలి.
  • చివరగా క్రిమినల్ కేసులేమైనా ఉన్నాయా లేదా అనే వివరాలు చెప్పాలి.
  • ఇవన్నీ ఇచ్చిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి, సబ్మిట్ చేయాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. దీంతో దరఖాస్తు పూర్తవుతుంది.