న్యూఢిల్లీ:స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాజ్యసభ ఎంపీ పేరు చెప్పకుండా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా ఎంచుకొని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను అరెస్ట్ చేశారని అన్నారు. మరోవైపు బిభవ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. బిభవ్ కుమార్ ను అరెస్ట్ చేయడం ముందస్తు బెయిల్ ను ఇవ్వలేమని శనివారం కోర్టు వెల్లడించింది.
ఇదిలా వుంటే శనివారం మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి గత సహాయకుడు బిభవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం అధికారిక నివాసంతో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి తనపై పదేపదే దాడి చేశారని ఆరోపిస్తూ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను బిభవ్ కుమార్ పదేపదే బలంగా కొట్టాడని.. అయితే ఎవరూ అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు.
అయితే మలివాల్ వ్యాఖ్యలపై ఆప్ నేతలు మందిపడ్డారు. అక్రమ రిక్రూట్ మెంట్ కేసులో మలివాల్ అరెస్ట్ అయ్యారని.. సీఎం కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగం కావాలని ఆమెను బీజేపీ బ్లాక్ మెయిల్ చేసిందన ఆప్ మహిళా నేత అతిషీ అన్నారు.
