సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు తన్నీరు హరీష్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని హరీష్ రావు అన్నారు.

డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఉపముఖ్యమంత్రిగా  భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకరం చేయగా.. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలతోపాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు.