ఎన్డీఏ అభ్యర్థే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ ..YSRCP సపోర్ట్, TRS ఆబ్సెంట్

ఎన్డీఏ అభ్యర్థే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ ..YSRCP సపోర్ట్, TRS ఆబ్సెంట్
  • రెండోసారిఎన్నికైన హరివంశ్
  • వాయిస్ ఓటుతో గెలిచినట్లుప్రకటించిన చైర్మన్​ వెంకయ్య
  • ప్రతిపక్షాల అభ్యర్థిగా ఆర్జేడీ ఎంపీ మనోజ్​ ఝా

న్యూఢిల్లీపార్లమెంట్​లో ఎన్డీఏ సర్కారుకు కీలక సమయాల్లో మద్దతు తెలుపుతూ వచ్చిన టీఆర్ఎస్​ తన రూట్​మార్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థికి టీఆర్ఎస్​ మద్దతు ఇవ్వలేదు. ఆ పార్టీ ఎంపీలు ఓటింగ్​కుఆబ్సెంట్​ అయ్యారు. మరోవైపు ఏపీలో అధికార పార్టీ వైసీపీ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​గా ఎన్డీఏ క్యాండిడేట్, జేడీయూ సీనియర్​ నేత హరివంశ్​ నారాయణ్​సింగ్​ రెండోసారి ఎన్నికయ్యారు.

హరివంశ్ పేరును బీజేపీ ఎంపీ జేపీ నడ్డా ప్రతిపాదించగా.. సభా నాయకుడు థావర్ చంద్ గెహ్లాట్ మద్దతిచ్చారు. ప్రతిపక్షాలు ఆర్జేడీ మెంబర్ మనోజ్ ఝాను తమ క్యాండిడేట్ గా బరిలోకి దింపాయి. ఓటింగ్​ సందర్భంగా హరివంశ్ కు వైసీపీ మద్దతు తెలపగా.. టీఆర్ఎస్ మెంబర్స్ గైర్హాజరయ్యారు. హరివంశ్ వాయిస్ ఓట్ తో ఎన్నికైనట్లు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. ప్రధాని మోడీతోపాటు ప్రతిపక్ష సభ్యులు ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. హరివంశ్‌ అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మేధావి అని, ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, డెమోక్రసీ పార్లమెంటరీ వ్యవస్థ బలోపేతానికి ఇది చాలా అవసరమని ప్రధాని మోడీ అన్నారు. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 113 మంది మెంబర్స్ ఉండగా, అపొజిషన్ ఎంపీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్ పై హరివంశ్ గెలిచి తొలిసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​ అయ్యారు.