జూరాలకు పోటెత్తిన వరద.. రెండు గేట్లు ఎత్తివేత

జూరాలకు పోటెత్తిన వరద.. రెండు గేట్లు ఎత్తివేత

భారీ వర్షాలకు తెలంగాణ ప్రాజెక్టులు  జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహాం కొనసాగుతోంది.   కర్ణాటకలో  కురుస్తున్న వర్షాలకు  ఆల్మట్టి నుంచి లక్షా 25 వేల క్యూసెక్కులు విడుదల నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో జూరాలకు వరద పోటెత్తింది.  రెండు గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు.  

మరో వారం రోజులు ఇదే స్థాయిలో ఆల్మట్టి నుంచి జురాలకు నీరు వస్తే అన్ని గేట్లు తెరుచుకోనున్నాయి. అపుడు  శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం పెరగనుంది. జురాల నుంచి 6 యూనిట్లలో కరెంట్ ఉత్పత్తి అవుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు.