బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..

బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..

రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెల మొదటి వారం లో రికార్డ్ స్థాయిలో హై టెంపరచర్స్ నమోదవుతున్నాయి. రాష్ట్రంపై తీవ్ర వడగాల్పులు ఉన్నాయని హైదరాబాద్ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ నడుస్తోన్నట్టు తెలిపింది.

 ఖమ్మం జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది ఐఎండీ. ఆదిలాబాద్ జిల్లాలో సైతం అంతే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించింది. హైద్రాబాద్ లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ వెల్లడించింది.

 ఎండల తీవ్రత ఎక్కవ ఉండటంతో ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూమి నుండి వెలువడే వేడి గాలులు, గాలిలో తేమశాతం తగ్గటం వల్ల సమ్మర్ హీట్ పెరుగుతోందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అడవుల నరికివేత, పారిశ్రామిక అభివృద్ధి, అర్బనైజేషన్ పెరగడమే కారణమని తెలిపారు.