సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల రద్దీ 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల రద్దీ 

శుక్రవారం ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో అట్టుడికిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతోంది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, టాస్క్ ఫోర్స్ పహరా మధ్య రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్యాసింజర్ల టికెట్లు, ఫ్లాట్ ఫాం టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రయాణికులను లోపలకు అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వేస్టేషన్ లోపల, బయట పోలీసులు పెద్దఎత్తున మొహరించారు. 

ఆందోళనకారుల విధ్వంసంలో దాదాపు రూ.30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే శాఖ అంచనా వేసింది. సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదిక వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్లాట్ ఫాంలు, ట్రాక్లపై నిరసనకారులు వేసిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేస్తున్నారు.ఆందోళనల్లో దాదాపు 350 వరకు ఫ్యాన్లు, వందల సంఖ్యలో లైట్లు పగిలిపోగా.. వాటి స్థానంలో కొత్తవి అమర్చుతున్నారు.