ఇండియా లాంటి పెద్ద దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు..!

ఇండియా లాంటి పెద్ద దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు..!

ఇండియా లాంటి పెద్ద దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు..!
కేసులు, డెత్స్, ఖర్చు భారీగా ఉంటాయ్
స్ట్రాటజికల్‌‌‌‌గా అది సరైంది కాదు
టీకాతోనే ఇమ్యూనిటీ వస్తది
అప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి
కేంద్రహెల్త్ మినిస్ట్రీ ప్రకటన

న్యూఢిల్లీ: జనాభా పరంగా చాలా పెద్ద దేశం అయిన ఇండియాకు హెర్డ్ ఇమ్యూనిటీ మంచి ఆప్ష
న్ కాదని, అది స్ట్రాటజికల్ గా సరైన చాయిస్ కాదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనాకు టీకా వచ్చేదాకా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో ఇరవై ఐదు శాతం మందికి కరోనా యాంటీబాడీలు తయారయ్యాయని ఢిల్లీ సీరాలజికల్ సర్వేలో ఇటీవల వెల్లడికావడంతో దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ పట్ల ఆశలు చిగురించాయి. అయితే గురువారం మీడియాతో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఓఎస్డీ
రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ.. మనదేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ అవకాశాన్ని కొట్టి పారేశారు. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది కరోనా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ ఇస్తుందన్నా రు. ఇన్ఫెక్షన్ వల్ల లేదా టీకాల వల్లనే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్నారు. మనకు టీకాతోనే ఇది సాధ్యమవుతుందని, అది కూడా భవిష్యత్తులోనే అని చెప్పారు.

భారీ మూల్యం తప్పదు..

ఇండియా వంటి పెద్ద దేశానికి హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రాజేశ్
భూషణ్ అన్నారు. పెద్ద ఎత్తున కేసులు, డెత్స్ జరిగితేనే వైరస్ కు ఇమ్యూనిటీ వచ్చే చాన్స్ ఉంటుందని.. అందువల్ల ఇది మంచి ఆప్షన్ కాదన్నారు. ఇప్పటికైతే హెర్డ్ ఇమ్యూనిటీకి చాలా దూరంలో ఉన్నామని ఆయన అన్నారు.

కొన్ని ఏరియాల్లోనే సాధ్యం..

ముంబై, ఢిల్లీలో జరిగిన సీరాలజికల్ సర్వేల్లో.. చాలా మందికి కరోనా యాంటీబాడీలు కనిపించినా.. హెర్డ్
ఇమ్యూనిటీ ఈజీ కాదనిసైంటిస్టులు అంటున్నారు. 70 నుండి 90 శాతం ప్రజలకు ఇమ్యూనిటీ వస్తేనే
అది వీలవుతుందని చెప్తున్నారు. దేశంలో కొన్నిప్రాంతాల్లో హెర్డ్ ఇమ్యూనిటీకి చాన్స్ ఉంటుందని అం
టున్నారు. కాగా హెల్త్‌‌‌‌కేర్ ప్రొవైడర్ల కోసం రూ .50 లక్షల కొవిడ్ -19 బీమా పథకం కింద ప్రభుత్వానికి
ఇప్పటివరకు 131 క్లెయిమ్‌‌‌‌లు వచ్చాయని చెప్పారు.

రికవరీ రేటు పెరిగింది
దేశవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీ రేటు 64.4శాతంఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఏప్రిల్‌‌‌‌ నెలలో7.85 శాతంగా ఉన్న ఈరేటు ప్రస్తుతం 64 శాతానికి చేరుకోవడం ఊరట కలిగించే విషయమని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వైరస్‌‌ బారినపడిన వారిలో ఇప్పటివరకు 10లక్షల మంది కోలుకున్నారని స్పష్టం చేసింది. వైద్యులు, నర్సులతోపాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగానే బాధితులు ఈ
స్థాయిలో కోలుకుంటున్నట్లు అభిప్రాయపడింది. దేశంలో ఇప్పటివరకు కోటీ 81 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ ప్రతి పది లక్షల జనాభాకు 324టెస్టులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

హ్యూమన్‌‌‌‌ ట్రయల్స్‌‌‌ దశలో2 వ్యాక్సిన్‌‌‌‌లు
ప్రస్తు తం దేశంలో అభివృద్ధి చేస్తోన్న రెండు కరోనా వ్యాక్సిన్‌లు మొదటి, రెండో
దశ హ్యూమన్ ట్రయల్స్‌‌‌‌లో ఉన్నాయని రాజేష్ ‌భూషణ్ ‌చెప్పారు. రెండు వ్యాక్సిన్లు ఫేజ్‌-–1,ఫేజ్–-2దశల్లో ఉన్నట్లు తెలిపారు. 2.21శాతానికి తగ్గిన మరణాలరేటు..ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు భారత్‌‌‌‌లోనే తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ సగటు 4శాతం ఉండగా భారత్‌‌‌‌లో 2.21 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..