Nithiin New Movie: డూ ఆర్ డై సిట్యువేషన్‌లో నితిన్.. బర్త్ డే స్పెషల్గా కొత్త సినిమా అనౌన్స్..

Nithiin New Movie: డూ ఆర్ డై సిట్యువేషన్‌లో నితిన్.. బర్త్ డే స్పెషల్గా కొత్త సినిమా అనౌన్స్..

టాలీవుడ్ హీరో నితిన్ పుట్టినరోజు (మార్చి 30, 2026) సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నితిన్‌ మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటికే ఇదే బ్యానర్‌లో వచ్చిన ‘భీష్మ’, ‘రంగ్ దే’ సినిమాలతో సక్సెస్ అందుకున్న నితిన్, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 43వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ప్రస్తతం నితిన్ తన 36వ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ V. I. ఆనంద్ రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, నితిన్ కెరీర్‌లో అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అలాగే, నితిన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ‘ఆయ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అంజి చెప్పిన కథకు నితిన్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. జూలై నుంచి షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  ప్రస్తుతం వరుస ప్లాప్స్తో ఉన్న నితిన్, ఈ కొత్త ప్రాజెక్ట్‌లతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

►ALSO READ | Viral Video: వెంకీమామ సింప్లిసిటీ వైరల్.. సామాన్యుడిలా హోటల్లో బ్రేక్‌ఫాస్ట్.. నెటిజన్స్ ఫిదా

నితిన్ వరుస ఫెయిల్యూర్స్:

నితిన్ విషయానికి వస్తే.. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్నాడు. ఇటీవలే మాచెర్ల నియోజకవర్గం, ఎక్సట్రా, రాబిన్ హుడ్, తమ్ముడు వంటి వరుస మూవీస్తో ఘోరపరాజయాలను చవిచూశాడు. ఇపుడీ ఈ కొత్త సినిమాల పైనే నమ్మకం పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే కంటెంట్ సెలెక్ట్ చేసుకుని వస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఈ సినిమాలు కూడా నితిన్ కు సక్సెస్ ఇవ్వకపోతే.. ఆపై ఆశలన్నీ గల్లంతే!!