టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ బెంగళూరులో సందడి చేశారు. స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి ఆర్భాటం లేకుండా, సామాన్యుడిలా హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే
ఇటీవల వెంకీ మామ.. బెంగళూరులోని ఐకానిక్ హోటల్ అయిన "విద్యార్థి భవన్"ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి భవన్‌లో వెంకటేష్ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడి ప్రసిద్ధ దోసా సహా పలు వంటకాలను రుచి చూశారు. ఈ క్రమంలో ఆయన అక్కడికి రావడంతో రెస్టారెంట్ సిబ్బంది మరియు స్థానికులలో ఉత్సాహం నెలకొంది.
ప్రస్తుతం వెంకీ మామ టిఫిన్ చేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వెంకటేష్ చాలా సింపుల్‌గా కనిపించడం, ఎలాంటి స్టార్ హంగులు లేకుండా సాధారణంగా టిఫిన్ చేయడం నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.
ఇది చూసిన విక్టరీ ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ట్వీట్స్ పెడుతున్నారు. “వెంకీమామ సింప్లిసిటీకి సాటి లేదు”, “ఇంత పెద్ద స్టార్ ఇలా ఉండటం గొప్ప విషయం” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా, వెంకటేష్ ఈ సడన్ విజిట్ మరియు ఆయన సింపుల్ నేచర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక పోస్ట్
వెంకటేష్ సందర్శన అనంతరం విద్యార్థి భవన్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో “ఎప్పటికీ ఆకర్షణీయంగా ఉండే వెంకటేష్ గారికి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాం” అంటూ పేర్కొంది. టాలీవుడ్‌లో అత్యుత్తమ నటుల్లో ఒకరైన ఆయనకు అల్పాహారం అందించడం తమకు గర్వకారణమని వెల్లడించింది.
ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ విజిట్
వెంకటేష్ అకస్మాత్తుగా చేసిన ఈ విజిట్ అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. ఆయన సాదాసీదా స్టైల్‌లో కనిపించడం, స్థానిక వంటకాలను ఆస్వాదించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా, బెంగళూరులోని ఐకానిక్ విద్యార్థి భవన్‌లో వెంకటేష్ చేసిన ఈ బ్రేక్‌ఫాస్ట్ విజిట్, ఫుడ్ లవర్స్‌తో పాటు సినీ అభిమానుల్లోనూ మంచి చర్చకు దారితీసింది.
►ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఆదర్శ కుటుంబం:
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47' అనే మూవీ రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తిచేసి, ఆగస్ట్ లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
వెంకటేష్ కెరీర్‌లో ఇది 77వ చిత్రం కాగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్, తమిళ కమెడియన్ యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Presenting #VenkateshXTrivikram as “Aadarsha Kutumbam House No: 47 - AK 47”🏠🔥
— Venkatesh Daggubati (@VenkyMama) December 10, 2025
Shoot begins today 🤗
In cinemas, Summer 2026 ♥️✨#AK47 | #AadarshaKutumbam | #Venky77 | #Trivikram @SrinidhiShetty7 #SRadhaKrishna @haarikahassine pic.twitter.com/pdtl4wh3ro
