పేదలకు తక్కువ ఖర్చుతోనే పెద్ద చదువులు

పేదలకు తక్కువ ఖర్చుతోనే పెద్ద చదువులు

శంషాబాద్​, వెలుగు: ‘గిఫ్టెడ్​ చిల్డ్రెన్​ స్కీమ్​’ కింద జీఎంఆర్​ వరలక్ష్మి ఫౌండేషన్​లో పేదలకు అతి తక్కువ ఖర్చుతోనే పెద్ద చదువులు చెబుతున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. ఆదివారం శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ పరిధిలో నిర్వహిస్తున్న జీఎంఆర్​ వరలక్ష్మి సెంటర్​ ఫర్​ ఎంపవర్​మెంట్​ అండ్​ లైవ్లీహుడ్​ను ఆయన సందర్శించారు. జీఎంఆర్​ ఫౌండేషన్​తో కలిసి చిన్మయ మిషన్​ నడుపుతున్న జీఎంఆర్ ​చిన్మయ స్కూల్​నూ పరిశీలించారు. చదువులను ఆపేసిన పేద స్టూడెంట్లకు ఒకేషనల్​ ట్రైనింగ్​ అందించి వారికి ఉపాధి అందించడంలో ఫౌండేషన్​ కృషి చేస్తోందని కొనియాడారు. ట్రైనింగ్​ తీసుకుంటున్న స్టూడెంట్లు, జనపనార బ్యాగుల తయారీ కోసం శిక్షణ తీసుకుంటున్న మహిళలతో ఆయన మాట్లాడారు. ఎయిర్​పోర్ట్​ దగ్గర నివసించే 100 మంది పేద స్టూడెంట్ల ఖర్చు భరించడం మంచి విషయమన్నారు. దేశంలోని 20 చోట్ల స్థానిక ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు.