అటల్ చౌక్.. వాజ్ పేయికి జనం నివాళి

అటల్ చౌక్.. వాజ్ పేయికి జనం నివాళి

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా  లక్నో ప్రజలు తమ ప్రాంతంలోని  హజ్రత్‌గంజ్ కూడలికి అటల్ చౌక్ అని పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 1842 సంవత్సరంలో నవాబ్ అంజద్ అలీ షా ఏర్పాటు చేసిన హజ్రత్ గంజ్ కు అటల్ చౌక్ గా పేరు మార్చారు. పేరు మార్చే విషయంపై గత ఏడాదిలోనే లక్నో మున్సిపల్ కార్పోరేషన్ కమిటీ పర్మిషన్ తీసుకున్నారు ఆ ప్రాంత ప్రజలు.

లక్నో మున్సిపల్ కార్పోరేషన్..  వాజ్ పేయి పై గౌరవంతో లాల్ బాగ్ లోని జాండివాలా పార్క్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న హజ్రత్ గంజ్ పేరు మార్పుపై మేయర్ సంయుక్త భాటియా మాట్లాడుతూ..  ఈ ఏరియా పేరు మార్చేందుకు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారనని తెలిపారు.