25 ఏళ్ళ తరువాత హిట్ కాంబినేష‌న్.. త్వరలో మూవీ షురూ..

 25 ఏళ్ళ తరువాత హిట్ కాంబినేష‌న్.. త్వరలో మూవీ షురూ..

కండల వీరుడు స‌ల్మాన్ ఖాన్(Salmankhan)  హీరోగా క‌రుణ్ జోహార్(KaranJohar) కాంబోలో ఓ మూవీ రానుంది. బాలీవుడ్ లో కుచ్ కుచ్ హోతా హై మూవీతో ఎంతో ఫేమస్ అయినా వీరిద్దరూ..మళ్ళీ 25 ఏళ్ళ తరువాత ఓ క్రేజీ కాన్సెప్ట్ తో వస్తుండటం విశేషం. ఈ సారి డైరెక్టర్ గా కాకుండా ప్రొడ్యూసర్ గా కరణ్ జోహార్ నిర్వర్తిస్తుండటం విశేషం. షేర్ షా మూవీతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ విష్ణు వ‌ర్ద‌న్(VishnuVardhan) ఈ మూవీను తెర‌కెక్కించ‌బోతున్నారు.  

ఈ మూవీకు సంబందించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ కు సిద్ధమవుతోన్న ఈ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రానున్నఈ మూవీ..భారీ యాక్ష‌న్ ఎంటర్టైన్ మెంట్ గా రాబోతుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ ను కొత్త అవతారంలో ప్రెసెంట్ చేయటానికి డైరెక్టర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ త్వరగ్గా కంప్లీట్ చేసి..క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ చేయటానికి కరణ్ ప్లాన్ చేస్తున్నారట.  

డైరెక్టర్ విష్ణు వ‌ర్ద‌న్ టాలీవుడ్ లో పంజా మూవీతో పవర్ స్టార్ ను కొత్త లుక్ లో ప్రసెంట్ చేశారు. గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో వచ్చిన ఆపంజా మూవీ ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా..అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ అవ్వటంలో విఫలమైంది. ఇక బాలీవుడ్ లో వచ్చినా షేర్ షా మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఇక కోలీవుడ్ లోను కొన్ని మూవీస్ చేసి..మంచి పేరు తెచుకున్నారు. కాగా సల్మాన్ భాయ్ తో తీయనున్న మూవీ భారీ లెవెల్లో వస్తుండటంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.