అయ్యోపాపం..! అక్కడ గుర్రాలు, ఒంటెలు అస్సలు ఎక్కొద్దు

అయ్యోపాపం..! అక్కడ గుర్రాలు, ఒంటెలు అస్సలు ఎక్కొద్దు

మూగజీవాలను హింసిస్తుంటే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంటుంది. ప్రపంచ వింతల్లో ఒకటైన పిరమిడ్స్ ఉన్న ఈజిప్ట్ దేశంలోనూ… ఈ అనాగరికత ఎక్కువగానే ఉంది. ఈజిప్ట్ పిరమిడ్స్ ను చూసేందుకు వెళ్లే పర్యాటకులను ఒంటెలు, గుర్రాలపై తీసుకెళ్తుంటారు అక్కడి వ్యాపారులు. టాంగాలు, బగ్గీలపై వెళ్తూ అక్కడి అందాలు, చరిత్ర తెల్సుకోవడంలో ఎంతో మంచి అనుభూతి ఇస్తుంటుంది. కానీ… దాని వెనుక ఆ జంతువులు పడే శారీరక, మానసిక వేదన ఏంటో పెటా ఏషియా వివరిస్తోంది.

అక్కడ ఎక్కువగా గుర్రాలు, ఒంటెలతో బండ్లు లాగిస్తుంటారు. ఐతే… వాటిని నడిపేవాళ్లు కొట్టే దెబ్బలకు ఆ జంతువులు చిత్రవధ అనుభవిస్తున్నాయంటూ ఓ వీడియోను రూపొందించింది పెటా ఏషియా. వాళ్లు కొట్టే దెబ్బలకు అవి కుప్పకూలిపోతాయని.. ఐనా… కనికరం చూపకుండా ఘోరందా దాడులు చేస్తున్నారనీ.. మనుషులుగా అందరూ అర్థం చేసుకోవాలని కోరుతోంది. బండి లాగలేని జంతువులను… తక్కువ ధరకు అక్కడ మార్కెట్ లో అమ్మేస్తారని వివరించింది. ఈజిప్ట్ కు వెళ్తే.. మోటర్ వాహనాలు ఎక్కి అక్కడి ప్రదేశాలు చూడాలని.. అప్పుడైనా జంతువుల వాడకం అక్కడ తగ్గుతుందని.. వాటికి బాధ తప్పుతుందని అంటోంది పెటా ఏషియా.