Hrithik Roshan : 49 ఏండ్లైనా...యంగ్ లుక్

Hrithik Roshan : 49 ఏండ్లైనా...యంగ్ లుక్

బాలీవుడు నటుడు హృతిక్ రోషన్ నేడు 49 పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల నుండి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా హృతిక్ తండ్రి, ప్రముఖ దర్శకుడు, నటుడు రాకేష్ రోషన్ కూడా తన కొడుకుపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రోషన్, కొడుకు హృతిక్ రోషన్ ఇద్దరూ బ్లాక్ లెదర్ జాకెట్లు, టీ-షర్టులను ధరించిన ఫొటోలను షేర్ చేశారు. దాంతో పాటు.. "డుగ్గు.. హ్యాపీ బర్త్‌డే మై కూలెస్ట్ సన్" అంటూ కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయానికొస్తే.. ఆయన తదుపరి యాక్షన్ చిత్రం ఫైటర్‌లో దీపికా పదుకొనేతో కలిసి నటించనున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. హృతిక్ రోషన్ చివరిసారిగా సైఫ్ అలీ ఖాన్‌తో విక్రమ్ వేద చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం తమిళంలో అదే పేరుతో వచ్చిన మూవీకి రీమేక్. కాగా ప్రస్తుతం హృతిక్ .. సబా ఆజాద్ తో డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం.