పూర్తిగా నిండిన హుస్సేన్ సాగర్

పూర్తిగా నిండిన హుస్సేన్ సాగర్

హైదరాబాద్, వెలుగు: హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. సోమవారం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్టీఎల్)కి సమానంగా నీళ్లు వచ్చి చేరాయి. హుస్సేన్‌సాగర్ నీటి మట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.40 మీటర్ల మేర నిల్వ ఉంది. ప్రస్తుతం 1,780 క్యూసెక్కులను బయటకు పంపుతున్నారు. ఉస్మాన్‌ సాగర్‌‌కు కాస్తా వరద తగ్గగా, ఆదివారం వరకు 8 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

హుస్సేన్ సాగర్ ఇన్ ఫ్లో 1,200 క్యూసెక్కులు ఉండగా, సోమవారం రెండు గేట్లను క్లోజ్ చేసి ఆరు గేట్ల ద్వారా 1,278 క్యూసెక్కులను మూసీలోకి వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,787 అడుగుల మేర నీరు ఉంది. అలాగే, హిమాయత్ సాగర్‌‌కు 250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఔట్ ఫ్లో 330 క్యూసెక్కులుగా ఉంది. ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1,760.60 అడుగుల నిల్వ ఉంది.