నీళ్లల్లో ఆగిన సిటీ బస్సు.. తప్పిన పెద్ద ప్రమాదం

నీళ్లల్లో ఆగిన సిటీ బస్సు.. తప్పిన పెద్ద ప్రమాదం

హైదరాబాద్ సిటీని భారీ వర్షం ముంచెత్తింది. ఏప్రిల్ 29వ తేదీ.. శనివారం తెల్లవారుజాము నుంచి కుండపోత వానతో వణికిపోయింది. ఆకావానికి చిల్లుపడిందా అన్నట్లు భారీ వర్షం బెంబేలెత్తించింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాలు అన్నీ మునిగిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ శివార్లలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు వచ్చింది చేరింది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేని ఆర్టీసీ సిటీ బస్సు డ్రైవర్.. అదే వేగంలో ముందుకొచ్చేశారు. 

సరిగ్గా బ్రిడ్జి కిందకు రాగానే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి.. బస్సు సగం మునిగిపోయింది. ఇంజిన్ లోకి నీళ్లు వెళ్లటంతో బస్సు ఆగిపోయింది. బ్రిడ్జి మధ్యలో బస్సు ఆగిపోవటం.. బస్సులోకి నీళ్లు రావటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే బస్సులో నుంచి బయటకు దిగి.. నడుంలోతు నీటిలో నడుస్తూ బయటకు వచ్చారు. 

బస్సు డ్రైవర్ నీటి లోతును అంచనా వేయకపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు గంటలు పడిన కుండపోత వానకు.. సిటీలోని చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

https://www.youtube.com/watch?v=5nz6LoqY_XM