లాక్‌డౌన్‌లో కొత్త క్రెటా కారకు 20వేల బుకింగ్‌లు

లాక్‌డౌన్‌లో కొత్త క్రెటా కారకు 20వేల బుకింగ్‌లు

ప్రకటించిన హ్యూందాయ్‌‌
ముంబై: లాక్‌డౌన్‌ వల్ల అన్ని బిజినెస్‌లు పడిపోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ హ్యూందాయ్‌కు మాత్రం కార్ల బుకింగ్‌లు విపరీతంగా వస్తున్నాయి. హ్యూందాయ్‌ ఈ ఏడాది రిలీజ్‌ చేసిన కొత్త తరం క్రెటా కారుకు ఈ లాక్‌డౌన్‌లో 20వేల బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. ప్రీ బుక్కింగ్స్‌ 14000 రాగా.. ఈ లాక్‌డౌన్‌లోనే దాదాపు 20వేల బుకింగ్స్‌ వచ్చాయని సేల్స్‌, మార్కెటింగ్‌, సర్వీస్‌ డైరెక్టర్‌‌ తరుణ్‌ గార్గ్‌ చెప్పారు. “ లాక్‌డౌన్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి కారు గురించి ఎంక్వైరీ చేసే వారి సంఖ్య చాలా పెరిగింది. లాక్‌డౌన్‌లో జరిగిన బుకింగ్స్‌లో దాదాపు 75 శాతం క్రెటా కోసమే. దీన్ని ఇలానే కొనసాగిస్తాం” అని తరుణ్‌ అన్నారు. లాక్‌డౌన్‌ అయిన వెంటనే డెలివరీ స్టార్ట్‌ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 6703 యూనిట్ల కొత్త క్రియాటా కార్లను డీలర్లకు అందించామని, లాక్‌డౌన్‌ తర్వాత నెలకు 10వేల యూనిట్లు ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నామని వెల్లడించారు. హ్యుందాయ్‌కు చెందిన ఈ కొత్త కారు అధునాతన టెక్నాలజీతో రానుంది. మన దేశంలో మార్చిలో 16 న కారును చేశారు.