
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇలియానా. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని రెండో సినిమా ‘పోకిరి’తో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ అందుకున్న ఆమె.. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి తెలుగు తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా రాణించింది. ఇక్కడ కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్‌కు షిప్ట్ అయింది. ప్రారంభంలో అవకాశాలు దక్కినా, సక్సెస్ మాత్రం వరించలేదు. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న ఆమె.. ఇండిపెండెంట్ వీడియో సాంగ్స్‌పై ఫోకస్ పెట్టింది. గత ఏడాది బాలీవుడ్ సింగర్ కరణ్‌తో ఓ వీడియో సాంగ్ చేసిన ఆమె.. తాజాగా ర్యాపర్ బాద్‌షాతో కలిసి వీడియో సాంగ్‌లో నటించింది. ‘సబ్ గజబ్’ పేరుతో వస్తున్న ఈ సాంగ్ పోస్టర్‌ను ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇలియానా. ఈ పోస్టర్‌లో బోల్డ్ లుక్‌లో కనిపిస్తోందామె. ఈ ఏడాది రాబోతున్న హాటెస్ట్ ట్రాక్ ఇదని ఇలియానా చెప్పింది. త్వరలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. మరి ఈ వీడియో ఆల్బమ్‌తోనైనా ఇలియానా మునుపటిలా బిజీ అవుతుందేమో చూడాలి!