నేను ఓ అమరవీరుడి కుమారున్ని

నేను ఓ అమరవీరుడి కుమారున్ని

జలియన్‌వాలా బాగ్ స్మారక పునర్ నిర్మాణం వివాదాస్పదమవుతోంది. స్మారకం దగ్గర లైట్ షో నిర్వహించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. లేటెస్టుగా ఈ వివాదంపై రాహుల్ గాంధీ  స్పందించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయనివాళ్లు.. దీన్ని అర్థం చేసుకోలేరని ఆయన ఇంగ్లీష్‌లో ఓ ట్వీట్ చేశారు. హిందీలోనూ ఓ ట్వీట్ చేసిన రాహుల్‌.. జలియన్‌వాలా బాగ్ అమరవీరులను అవమానించారని, అమరవీరులంటే తెలియనవాళ్లు మాత్రమే అలా చేస్తారని, తాను ఓ అమరుడి కుమారున్ని అని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని అన్నారు. లైట్ షోను రాహుల్ క్రూరత్వంతో పోల్చారు.