బీఆర్ఎస్ లీడర్లకు సెక్రటేరియెట్లోకి ఎనీ టైమ్ ఎంట్రీ

బీఆర్ఎస్ లీడర్లకు సెక్రటేరియెట్లోకి ఎనీ టైమ్ ఎంట్రీ

బీఆర్ఎస్ లీడర్లకు సెక్రటేరియెట్లోకి ఎనీ టైమ్ ఎంట్రీ
ప్రతిపక్ష నాయకులు, ప్రజలకు మాత్రం రూల్స్ 
మహారాష్ట్ర లీడర్లకు అయితే స్పెషల్ ఎంట్రీ  

హైదరాబాద్, వెలుగు : కొత్త సెక్రటేరియెట్​లో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన అమలవుతోంది. అధికార పార్టీ నేతలకు ఒకలా.. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు ఇంకోలా ఎంట్రీ లభిస్తున్నది. ఇక ప్రతిపక్ష లీడర్లను అయితే ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. గురువారం మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్​లీడర్లకు సెక్రటరియెట్​లోకి స్పెషల్​ఎంట్రీ లభించింది. విజిటర్స్​టైమ్ లో కాకుండా, ఎలాంటి పాస్​లు లేకున్నా ఒక్క ఫోన్​కాల్​తో 20 మందికి పైగా లీడర్లు లోపలికి వెళ్లారు. దీంతో సెక్రటేరియెట్​ లోపలికి వెళ్లేందుకు పొద్దున్నే 11 గంటల వరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విజిటర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ వాళ్లకి పాస్​లు.. వేరే రాష్ట్రమైతే డైరెక్ట్​ ఎంట్రీనా? అంటూ మండిపడ్డారు. తమకేమో టైమింగ్స్ పెట్టారని, ఇతరుల విషయంలో మాత్రం అలా లేదా? ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లీడర్లు ఎవరైనా సరే సెక్రటేరియెట్​లోకి వెళ్లేందుకు పెద్దగా ప్రాసెస్​ఏమీ ఉండట్లేదు. ముందే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి.. ‘పలానా వాళ్లు వస్తున్నారు. పంపించండి’ అని చెబుతున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు మాత్రం రూల్స్ పెడుతున్నారు. వచ్చిన వాళ్లందరినీ కాకుండా పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు.