టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

టీ20 వరల్డ్కప్లో  భాగంగా  సిడ్నీ వేదికగా పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్  పాకిస్తాన్ కు చావో రేవో లాంటిది. ఇందులో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడినా, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా పాకిస్తాన్ ఇంటిదారి పట్టాల్సిందే. ఇప్పటికే ఇండియా, జింబాబ్వే  చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ ఈ మ్యాచ్ ను చాలా సీరియస్ గా తీసుకుంది. అటు సౌతాఫ్రికా ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతుంది.

తుది జట్లు:

పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిం జూనియర్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, నసీమ్ షా

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(wk), టెంబా బావుమా(c), రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్రామ్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్టీజె, తబ్రైజ్ షమ్సీ, హెన్రిచ్ క్లాసెన్