చంద్రయాన్‌-2: ల్యాండర్ ఆర్బిట్ తగ్గించిన ఇస్రో

చంద్రయాన్‌-2: ల్యాండర్ ఆర్బిట్ తగ్గించిన ఇస్రో

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడికి మరింత దగ్గరగా వెళుతోంది. నిన్న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ ను విజయవంతంగా వేరు చేసిన ఇస్రో.. ఇవాళ ల్యాండర్ ఆర్బిట్ ను తగ్గించింది. ఆన్ బోర్డు ప్రాపల్షన్  సిస్టమ్ ఉపయోగించి.. ఉదయం 8 గంటల 50 నిమిషాలకు విజయవంతంగా ల్యాండర్ ఆర్బిట్ తగ్గించారు శాస్త్రవేత్తలు. కేవలం నాలుగు సెకన్లలోనే ఈ ప్రక్రియ  ముగిసింది.  ప్రస్తుతం చంద్రయాన్-2  35 X 97 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి చేరింది. రేపు మరోసారి ల్యాండర్ ఆర్బిట్ తగ్గించనుంది ఇస్రో.  ఈ నెల 7న చంద్రుడిపై దిగనుంది చంద్రయాన్ 2.  రాకెట్లను మండించడం ద్వారా వ్యోమనౌకను కిందకు దించుతారు. చంద్రుడి దక్షిణ దృవంపై చంద్రయాన్-2 ల్యాండ్ అవుతుంది. ఈ ప్రక్రియ 15నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ లో ఈ 15 నిమిషాలు అత్యంత కీలకం. ల్యాండ్ అయిన నాలుగు గంటలకు అందులోని రోవర్ బయటకు వస్తుంది. ఆర్బిటర్, ల్యాండర్ ల పరిస్థితిని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది ఇస్రో.