లాక్ డౌన్ టైమ్: పొలం పనుల్లో ప్లేయర్లు బిజీబిజీ

లాక్ డౌన్ టైమ్: పొలం పనుల్లో ప్లేయర్లు బిజీబిజీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి చాలా రంగాలతో పాటు క్రీడా రంగంపైనా పెను ప్రభావం చూపింది. వైరస్ దెబ్బకు ఒలింపిక్స్ లాంటి మేజర్ టోర్నీ సహా పలు టోర్నమెంట్ లు, సిరీస్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తో ఖాళీ టైమ్ దొరకడంతో క్రీడాకారులు పొలం పనుల్లో తమ వారికి సాయం చేస్తున్నారు. బాక్సర్లు అమిత్ పంఘాల్, మనోజ్ కుమార్, విమెన్ హాకీ ప్లేయర్ రాణి మాలిక్ తోపాటు పారా అథ్లెట్ రింకూ పంట కోతల టైమ్ లో తమ కుటుంబాలకు సాయం చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ క్రీడాకారుల్లో ఎవరెవరేం చేస్తున్నారో తెలుసుకుందాం..

ఫ్యామిలీకి సాయం చేస్తున్నా


‘నా బాక్సింగ్ కమిట్ మెంట్స్ వల్ల పంట కోతల టైమ్ లో నేను ఇతర ప్రాంతాల్లో ఉంటా. కానీ లాక్ డౌన్ కారణంగా ఈసారి నేను స్వగ్రామంలోనే ఉన్నా. దీంతో నా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నా. గోధుమల కోయడం, ప్యాకింగ్ విషయంలో సాయపడుతున్నా. రైతు కొడుకుననే విషయం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది’ అని వరల్డ్ నం.1 ఫ్లై వెయిట్ బాక్సర్ అమిత్ పంఘాల్ చెప్పాడు.

కొడవలిని హ్యాండిల్ చేయగలుగుతున్నా
ఇంటర్నేషనల్ విమెన్ హాకీ ప్లేయర్ రాణి మాలిక్ కూడా తన కుటుంబానికి సాయం చేస్తోంది. హార్వెస్టింగ్ కోసం రాణి ఒక మెషిన్ ను నియమించుకుంది. అయితే మెషిన్ ను యూజ్ చేయని చోట స్వయంగా తానే వెళ్లి పంటను కోస్తోంది. నాలుగు రోజుల్లో కొడవలిని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా నేర్చుకున్నానని రాణి పేర్కొంది.

నిజంగానే పంటను కోస్తున్నా


బాక్సర్ మనోజ్ కుమార్ కూడా తన పొలంలో హార్వెస్టింగ్ చేస్తున్నాడు. ‘చిన్నతనం నుంచి పెద్దవాళ్లు కోతలు కోయడం చూస్తూనే ఉన్నా. మా నాన్నకు తోడుగా ఉండాలని సరదాగా హార్వెస్టింగ్ చేస్తున్నా. ఈసారి నిజంగానే నేను పంటను కోస్తున్నా’ అని మనోజ్ కుమార్ నవ్వుతూ జవాబిచ్చాడు.

బకెట్ సాయంతో సంచులు నింపుతున్నా


2018లో పారా ఏషియన్ గేమ్స్ లో జావెలిన్ లో బ్రాంజ్ గెలిచిన ఇండియా యంగెస్ట్ పారా అథ్లెట్ రింకూ హుడా (20) కూడా తన కుటుంబానికి పొలం పనుల్లో చేదోడుగా ఉంటున్నాడు. హార్వెస్టింగ్ మిషన్ తో పాటు తానూ ఒకేసారి పని చేస్తానని రింకూ చెప్పాడు. పంట కోతలు అయిపోయాక ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపేందకు సాయపడతానన్నాడు. బకెట్ సాయంతో ధాన్యాన్ని సంచుల్లో నింపుతున్నానని చెప్పాడు. తమ గ్రామంలో వలస కార్మికులు లేరన్నాడు.