మన్రో షో : ఇండియాకు 213 రన్స్ భారీ టార్గెట్

మన్రో షో : ఇండియాకు 213 రన్స్ భారీ టార్గెట్

హామిల్టన్ : సెడాన్ పార్క్ లో జరుగుతున్న మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియాకు.. లోకల్ టీమ్ న్యూజీలాండ్ భారీ టార్గెట్ పెట్టింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది కివీస్.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇండియా. బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ ఓపెనర్లు బుల్లెట్ బిగినింగ్ ఇచ్చారు. సీఫర్ట్ 43(23 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సులు), మన్రో 72(40 బాల్స్ 5 ఫోర్లు, 5 సిక్సులు).. తొలి వికెట్ కు 7.4 ఓవర్లలోనే 80 రన్స్ పార్ట్ నర్ షిప్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా మిడిలార్డర్ ఆ జోరు కంటిన్యూ చేసింది. విలియంసన్ 27, గ్రాండ్ హోమ్ 30 రన్స్ చేశారు. చివర్లో మిషెల్ 19 రన్స్, టేలర్ 14 రన్స్ తో నాటౌట్ గా ఉన్నారు. వచ్చిన అందరు ప్లేయర్లు బ్యాట్ కు పనిచెబుతూ… భారత బౌలర్లను ఆటాడుకున్నారు. రోహిత్ శర్మ టీమ్ కు 213 రన్స్ భారీ టార్గెట్ పెట్టారు.  కులదీప్ యాదవ్ 2 వికెట్లు తీస్తే.. భువీ, ఖలీల్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇప్పటికే ఇండియా, న్యూజీలాండ్ టీట్వంటీ సిరీస్ లో 1-1 తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టీట్వంటీ కప్ అందుకుంటుంది.