ప్లాస్టిక్ నిషేధంపై మమ్మల్ని ఫాలో అవ్వండి: మోడీ

ప్లాస్టిక్ నిషేధంపై మమ్మల్ని ఫాలో అవ్వండి: మోడీ

న్యూఢిల్లీ:  సింగిల్‌‌‌‌‌‌‌‌ యూజ్‌‌‌‌‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌పై ఇండియా  విధానాలను అనుసరించాలని   ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ  కోరారు. సింగిల్‌‌‌‌‌‌‌‌ యూజ్‌‌‌‌‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ను నిషేధించాలని ఇండియా ఇప్పటికే నిర్ణయించిందని,  దీన్ని  మిగతా దేశాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని  ప్రపంచ నేతలకు ఆయన పిలుపునిచ్చారురు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌ నోయిడాలో ‘ క్లైమెట్‌‌‌‌‌‌‌‌ ఛేంజ్‌‌‌‌‌‌‌‌ క్రైసిస్‌‌‌‌‌‌‌‌’  అన్న అంశంపై సోమవారం జరిగిన  మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని పాల్గొన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల్ని ఎదుర్కొనేందుకు, భూమి ఎడారిగా మారకుండా ఉండేందుకు తమ సర్కార్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న చర్యల్ని  మోడీ వివరించారు. ఎడారి పెరగడాన్ని  ఆపడంపై యునైటెడ్‌‌‌‌‌‌‌‌ నేషన్స్‌‌‌‌‌‌‌‌ (యునైటెడ్‌‌‌‌‌‌‌‌ నేషన్స్‌‌‌‌‌‌‌‌ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌ టు కంబాట్‌‌‌‌‌‌‌‌ డిజెర్టిఫికేషన్‌‌‌‌‌‌‌‌)  ఆధ్వర్యంలో జరిగిన 14వ సమావేశాన్ని ప్రధాని ప్రారంభించారు. అటవీ ప్రాంతాన్ని రక్షించడం ద్వారా భూమి ఎడారిగా మారకుండా ఉండేందుకు  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని, నీటి కొరత సమస్యను ఎలా  అధిగమిస్తున్నదీ  మోడీ వివరించారు. పలువురు విదేశీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు రెండున ఆరు ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ వస్తువుల్ని దేశవ్యాప్తంగా  బ్యాన్‌‌‌‌‌‌‌‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రధాని ఇంకా ఏమన్నారంటే

  • 2015 – 2017 మధ్య కాలంలో దేశంలో అటవీ విస్తీర్ణం 80 వేల హెక్టార్ల మేర పెరిగింది.
    నీటి సమస్యల పరిష్కారానికి ‘జల్‌ శక్తి మంత్రివర్గం’ ఏర్పాటు చేశాం .
  • రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి భూమిని కాపాడుకునే వ్యూహాలనుఅభివృద్ధిచేయాలని ఇతర దేశాలను కోరుతున్నా.
  • వాతావరణ మార్పుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు టీమ్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌గా కలిసికట్టుగా పనిచేయాలి.