ఐఏఎఫ్‌ వీడియో గేమ్‌

ఐఏఎఫ్‌ వీడియో గేమ్‌

జులై 31న విడుదల చేయనున్న ఎయిర్‌ఫోర్స్‌

పాకిస్థాన్‌‌ టెర్రరిస్టు క్యాంపులపై ఇండియన్‌‌ ఎయిర్‌‌ఫోర్స్‌‌ రెండు సార్లు సర్జికల్‌‌ స్ట్రయిక్స్‌‌ చేసిన విషయం తెలుసు కదా. మన ఐఏఎఫ్‌‌ పైలట్లు, సైనికులు వీరోచితంగా పోరాడి టెర్రరిస్టులను, వాళ్ల క్యాంపులను నామరూపాల్లేకుండా చేశారు. అలాంటి దాడులు ఎలా ఉంటాయో ఇండియన్లకు రియల్‌‌ టైం ఎక్స్‌‌పీరియన్స్‌‌లో చూపించేందుకు ఓ వీడియో గేమ్‌‌ తీసుకొస్తోంది ఐఏఎఫ్‌‌ (భారత వైమానిక దళం). గేమ్‌‌కు సంబంధించి టీజర్‌‌ను ట్విట్టర్‌‌, ఫేస్‌‌బుక్‌‌లాంటి సోషల్‌‌ మీడియాల్లో శుక్రవారం రిలీజ్‌‌ చేసింది. ఆండ్రాయిడ్‌‌, ఐవోఎస్‌‌ ప్లాట్‌‌ ఫాంలలో జులై 31న గేమ్‌‌ను రిలీజ్‌‌ చేస్తామని చెప్పింది. తొలుత సింగిల్‌‌ ప్లేయర్‌‌ వెర్షన్‌‌లో విడుదల చేస్తున్నామని, త్వరలో మల్టీ ప్లేయర్‌‌ వెర్షన్‌‌ తీసుకొస్తామని చెప్పింది. ఆకాశంలో ఎయిర్‌‌ఫోర్స్‌‌ పైలట్‌‌ ఎలా డీల్‌‌ చేస్తారో, ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారో ఈ గేమ్‌‌లో తెలుసుకోవచ్చంది. ఫైటర్‌‌ జెట్లు, హెలికాప్టర్లతో ప్లేయర్‌‌ శత్రు భూభాగాల్లోకి  వెళ్లి అక్కడి క్యాంపులు, ఎయిర్‌‌క్రాఫ్టులను నాశనం చేయాల్సి ఉంటుందని వివరించింది.