పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నం.. !

పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నం.. !

న్యూఢిల్లీ:  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) పేమెంట్స్​ సెక్టార్​లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉందని,  పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఈ సంగతి తెలిసిన వాళ్లు చెప్పారు.  ఇందుకోసం మెమోరాండం ఆఫ్ అసోసియేషన్  మెయిన్ ఆబ్జెక్ట్స్ క్లాజ్‌‌‌‌‌‌‌‌ని మార్చడానికి ఇటీవలే ఢిల్లీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం పొందింది. కొత్త రూల్​ను చేర్చడం ద్వారా పేమెంట్​ అగ్రిగేటర్​ లైసెన్సు పొందడానికి వీలవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 26న జరిగిన ఏజీఎంలో కంపెనీ వాటాదారులు ఇందుకోసం ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. దీంతో ఐఆర్​సీటీసీ  పేమెంట్ అగ్రిగేటర్‌‌‌‌‌‌‌‌గా లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని నాన్- బ్యాంక్ పేమెంట్ అగ్రిగేటర్‌‌‌‌‌‌‌‌లకు పేమెంట్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్ చట్టం, 2007 ప్రకారం ఆర్​బీఐ నుంచి పర్మిషన్​ అవసరం.  దరఖాస్తు చేసే సంస్థ ఇందుకోసం మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎంఓఏ)లో మార్పులు చేయాలి.  

ఐఆర్​సీటీసీకి ఇప్పటికే ‘ఐ పే’ పేరుతో ఇంటర్నల్​ పేమెంట్​ గేట్‌‌‌‌‌‌‌‌వే ఉంది. ఇది ఐఆర్​సీటీసీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్,  మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌లో రైలు, బస్సు  విమాన ప్రయాణ టిక్కెట్‌‌‌‌‌‌‌‌లు,  టూర్ ప్యాకేజీల బుకింగ్ కోసం పేమెంట్లను తీసుకుంటుంది. “ఐఆర్​సీటీసీకి ఇప్పటికే పెద్ద మొత్తంలో యూజర్ బేస్ ఉంది. అందుకే పేమెంట్​ సేవలపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చు. ఆర్‌‌‌‌‌‌‌‌బిఐ ఆమోదం పొందిన తర్వాత  ఇది ఇతర వ్యాపారులతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. చాలా ఆఫర్లను కూడా అందించవచ్చు ”అని సంబంధిత వర్గాలు తెలిపాయి.   పేమెంట్​ అగ్రిగేటర్‌‌‌‌‌‌‌‌గా  ఐఆర్​సీటీసీ అన్ని రకాల ఎలక్ట్రానిక్  వర్చువల్ పేమెంట్, పేమెంట్​ గేట్‌‌‌‌‌‌‌‌వే,  అగ్రిగేటర్ సేవలు, ప్రీపెయిడ్,  పోస్ట్-పెయిడ్ పేమెంట్ల సేవలు అందిస్తుంది. యుటిలిటీ బిల్లులు, ఫీజులు  మునిసిపల్ పన్నుల కోసం బిల్​ పేమెంట్ సేవలను అందించడానికి బిల్లు పేమెంట్​ గేట్‌‌‌‌‌‌‌‌వేగా కూడా పనిచేస్తుందని ఐఆర్​సీటీసీ వర్గాలు తెలిపాయి.