చలికాలంలోనే గుండెపోటెక్కువ.?.జర పదిలం

చలికాలంలోనే గుండెపోటెక్కువ.?.జర పదిలం

చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. చాలా అధ్యయనాలు కూడా  ఇదే విషయాన్ని చెబుతున్నాయి. చలి తీవ్రతతో గుండె ఇతర శరీర భాగాల్లో రక్తనాళాలు కుంచించుకొని గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. చలికాంలో ముఖ్యంగా తెల్లవారుజామున గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కవని అంటున్నారు.  ఈ సీజన్‌లో గుండెపోటు వల్ల మరణించే రేటు 50 శాతం ఎక్కువంట.

చలికాలంలో హృదయ సంబంధ వ్యాధులు పెరగడానికి రక్తపోటు పెరుగుదల ప్రధాన కారణం కావచ్చు. ధమనులు ఇరుకుగా ఉండడం వల్ల  గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. చలికాలం రక్త ప్రవాహంలో కొన్ని ప్రోటీన్ల స్థాయిలను పెంచుతుంది, దీని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. అపుడు గుండెపోటు వస్తుంది. శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా ఉండటం వల్ల గుండె పోటు వచ్చే అవకాశముంటుంది.చలికాలంలో  గుండెపోటు, గుండె జబ్బుల బారిన పడే వాళ్లలో 65 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉన్నారు.

చల్లటి వాతావరణం పొగమంచు, కాలుష్య కారకాల నుండి ఛాతీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీని వల్ల గుండెపోటుకు దారితీస్తుంది. మరోవైపు, గుండె రోగులందరూ చలికాలంలో వారి గుండె మానసిక ఒత్తిడి స్థాయిలను ఎప్పటికప్పుడు  చెక్ చేసుకోవాలి.  సరిగా తినడం, అర్థరాత్రి మేల్కోనడం, క్రమం తప్పకుండా మందులు లేకపోవడం ,ధూమపానం, మద్యపానంతో గుండెపోటు రావచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • గుండె సంబంధ వ్యాధులున్నవారు రోజూ వ్యాయామం గుండెకు మంచిది, కాని చల్లగా ఉన్న రోజుల్లో  మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వాకింగ్,జాగింగ్ చేయాలి. ఎందుకంటే రక్తపోటు సహజంగా మార్నింగ్ పెరుగుతుంది కాబట్టి.
  • బాడీలో ఉష్ణోగ్రత సరిగ్గా ఉంచడానికి ఇంట్లో ఎక్కువ సమయం గడపాలి. అలాగే సాక్స్, గ్లౌజులు వేసుకోవాలి.  వెచ్చని దుస్తులతో మిమ్మల్ని మీరు కప్పుకోవాలి. వేడి నీళ్లతో స్నానం చేస్తే బెటర్.
  • ఎక్కువ ఆహారం తిన్నప్పుడు గుండెపై అదనపు భారం పడుతుంది. కాబట్టి వీలైనంత తక్కువగా తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం తగిన మోతాదులో తీసుకోవాలి.  తాగునీరు, ఉప్పునీటి శాతాన్ని బాడీకి తగిన మోతాదులో రోజూ తీసుకోవాలి.
  • ఎప్పుడైనా ఛాతిలో నొప్పిగా ఉండటం, చెమట, మెడ, దవడ,భూజం, కాళ్ల వాపు వంటి లక్షనాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.