సలార్‌ స్పెషల్ సాంగ్లో.. బంగార్రాజు బ్యూటీ!

సలార్‌ స్పెషల్ సాంగ్లో.. బంగార్రాజు బ్యూటీ!

ప్రభాస్ (Prabhas) అభిమానులతో పాటు పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్‌(Salaar). కేజిఎఫ్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth neel) నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

లేటెస్ట్ గా సలార్ మూవీలోని స్పెషల్ సాంగ్లో హాట్‌ బ్యూటీ సిమ్రత్‌ కౌర్‌ (Simratkaur) కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో.. షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై సలార్ మేకర్స్..ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.  చిన్న హీరోయిన్ కు..పెద్ద మూవీ ఆఫర్..అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సలార్ స్పెషల్ సాంగ్ గురుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది.  

ఇక సిమ్రత్ కౌర్ సినిమాల విషయానికి వస్తే..బాలీవుడ్ లేటెస్ట్ బాక్సాపీస్ చిత్రం గదర్ 2 లో నటించి మెప్పించింది. తెలుగులో నాగార్జున బంగార్రాజు లో క్యామియో రోల్ చేసింది. ఆ తర్వాత..పరిచయం, డర్టీ హరి, ప్రేమతో మీ కార్తీక్ వంటి మూవీస్ లో నటించింది