దొంగ డ్రామాలొద్దు.. దీదీపై దిలీప్ ఘోష్ ఫైర్

దొంగ డ్రామాలొద్దు.. దీదీపై దిలీప్ ఘోష్ ఫైర్

కోల్‌కతా: బెంగాల్ ఎన్నికల క్యాంపెయినింగ్‌‌లో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి గాయమైన సంగతి తెలిసిందే. దీదీ కారు డోరును కొందరు వ్యక్తులు కావాలనే బలంగా తోయడంతో ఆమెకు గాయమైందని తెలిసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. మమత గాయంపై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందించారు. దీదీవన్నీ దొంగ డ్రామాలని కొట్టిపారేశారు. గొప్ప డ్రామాను దీదీ పండించారని, కానీ ఇది మంచి స్క్రిప్ట్ మాత్రం కాదన్నారు. ఈ ఘటనపై తప్పకుండా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండి కూడా దాడి జరగడం ఏంటని ప్రశ్నించారు. దీదీ కావాలనే ఈ ఘటనపై రాజకీయాలు చేస్తూ, బీజేపీకి అప్రదిష్ట తెచ్చేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.