గుడ్‌‌‌‌‌‌‌‌లక్ జెర్రీ కోసం తిట్లు నేర్చుకున్న జాన్వీ కపూర్

గుడ్‌‌‌‌‌‌‌‌లక్ జెర్రీ కోసం తిట్లు నేర్చుకున్న జాన్వీ కపూర్

స్పోర్ట్స్ మూవీ చేస్తే ఆడటం నేర్చుకోవాలి. డ్యాన్స్ బేస్డ్ మూవీ చేస్తే కష్టమైన స్టెప్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ జాన్వీ కపూర్ మాత్రం తిట్టడం నేర్చుకుందట. నయనతార లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన ‘కొ కొ కోకిల’ మూవీని హిందీలో ‘గుడ్‌‌‌‌‌‌‌‌లక్ జెర్రీ’ పేరుతో రీమేక్ చేశాడు సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ సేన్‌‌‌‌‌‌‌‌గుప్తా. నయన్ పాత్రలో జాన్వీ నటించింది. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం  వేరే దారి లేక డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ని రవాణా చేసే అమ్మాయి పాత్ర ఇది. బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ నేటివిటీకి అనుగుణంగా మార్చుకునే క్రమంలో బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. దాంతో జాన్వీ బీహారీ అమ్మాయిగా మారాల్సి వచ్చింది. కానీ తనకి ఆ భాష రాదు. దాంతో ఓ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ని నిర్వహించారు. కొందరు ట్రైనర్స్​ని అపాయింట్ చేశారు. వాళ్ల దగ్గర ఆ భాష, యాస నేర్చుకుంది జాన్వీ. కాస్త మాస్ క్యారెక్టర్ కాబట్టి తిట్లు కూడా నేర్చుకోవాలని డైరెక్టర్ చెప్పడంతో వాటిని కూడా తెలుసుకున్నానని చెప్పింది జాన్వీ. ‘నాకసలు ఆ భాష కాస్త కూడా తెలీదు. అలాంటిది తిట్లు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. దాంతో నా ట్రైనింగ్ కాస్త గమ్మత్తుగా సాగింది’ అంటోంది నవ్వుతూ. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాన్వీ లుక్‌‌‌‌‌‌‌‌కి, నటనకి మంచి మార్కులే పడ్డాయి. దీంతోపాటు మిలీ, మిస్టర్ అండ్ మిసెస్ మాహీ, బవాల్ చిత్రాల్లోనూ నటిస్తోంది జాన్వీ. వీటిలో ఏ ఒక్కటి హిట్టయినా ఓ మంచి విజయాన్ని అందుకోవాలనే ఆమె కోరిక తీరుతుంది.