జేఈ‌ఈ ద‌ర‌ఖాస్తు తేదీపై కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న.. ఆ విద్యార్థులకు గోల్డెన్ చాన్స్

జేఈ‌ఈ ద‌ర‌ఖాస్తు తేదీపై కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న.. ఆ విద్యార్థులకు గోల్డెన్ చాన్స్

విదేశాల్లో ఉన్న‌త చ‌దువుల‌కు వెళ్లాల‌ని కోరుకుని.. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం చూసిన త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్న భార‌త్ లోనే చ‌దువుకోవాలుకుంటున్న‌ విద్యార్థుల‌కు కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శుభ‌వార్త చెప్పారు. ఇంట‌ర్మీడియ‌ట్, +2 త‌ర్వాత‌ దేశంలోని ప్ర‌ముఖ సాంకేతిక విద్యా సంస్థ‌ల్లో టెక్నిక‌ల్, వృత్తి విద్యా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) రాసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష అప్లికేష‌న్ గ‌డువు ఫిబ్ర‌వ‌రిలోనే ముగిసిపోయిన‌ప్ప‌టికీ క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనేక విజ్ఞ‌ప్తులు రావ‌డంతో మ‌రో చాన్స్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేంద్ర మంత్రి పోఖ్రియాల్. విద్యార్థులు, పేరెంట్స్ నుంచి వ‌చ్చిన విన‌తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మ‌ళ్లీ జేఈఈ ఆప్లికేష‌న్ తీసుకోవాల‌ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ వినీత్ జోషికి సూచించాన‌ని చెప్పారు. దీంతో ఆయ‌న స్పందించి, మంగ‌ళ‌వారం దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. విదేశాల‌కు వెళ్లే ఆలోచ‌న విర‌మించుకున్న వారితో పాటు, గ‌తంలో అప్లై చేసుకోలేక‌పోయిన వారు కూడా ఇప్ప‌డు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. మే 19 నుంచి 24 వ‌ర‌కు ఆన్ లైన్ లో అప్లికేష‌న్ ఫిల్ చేసి స‌బ్మిట్ చేయాల‌ని సూచించారు. కాగా, క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా మే నెల‌లో జ‌ర‌గాల్సిన జేఈఈ మెయిన్ ఎగ్జామ్.. జూలై 18 నుంచి 23 మ‌ధ్య నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ ప్ర‌క‌టించింది.

అప్లికేష‌న్ విధానం: ఆన్ లైన్

అప్లై గ‌డువు: మే 19 నుంచి మే 24 సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు

అప్లికేష‌న్ ఫీజు చెల్లింపు గ‌డువు: మే 19 నుంచి మే 24 రాత్రి 11:50 వ‌ర‌కు

ఫీజు వివ‌రాలు:

జ‌న‌ర‌ల్ కేట‌రిరీ, ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ (అబ్బాయిలు): రూ. 650

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ జెండ‌ర్స్, అన్ని కేట‌రిరీల అమ్మాయిలు: రూ. 325

వెబ్ సైట్: jeemain.nta.nic.in