అకడమిక్ కౌన్సిల్ లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష ప్రైజ్ పట్టండి

అకడమిక్ కౌన్సిల్ లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష ప్రైజ్ పట్టండి

ఔత్సాహిక ఆర్టిస్టులకు జార్ఖండ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని పరీక్షల నిర్వహణకు సంబంధించిన ‘జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్’ లోగో డిజైన్‌ చేయాలని కోరుతూ ప్రకటన చేసింది. ఎవరైనా తమ డిజైన్‌కను పంపవచ్చని, బెస్ట్ లోగో రూపొందించిన టాపర్స్‌కు  రూ.లక్ష ప్రైజ్ మనీ అందజేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. లోగో డిజైన్‌ విజేతలకు ప్రైజ్ మనీ ప్రతిపాదనతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీకి సంబంధించి తీర్మానం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఫేస్ మాస్కు ధరించకుండా తిరిగితే జరిమానా విధించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు ఫేస్ మాస్క్ తప్పనిసరి చేయడంతో పాటు మాస్కు పెట్టుకోకుండా బయటకు వస్తే ఫైన్లు వేస్తున్నాయి.