ఈ నెల 20న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’

ఈ నెల 20న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’
  • సక్సెస్​ చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ వినతి 

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై ఈనెల 20న ‘డిమాండ్స్ డే’ను నిర్వహిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య తెలిపారు. కలెక్టరేట్ల వద్ద చేపట్టే ధర్నాలకు జర్నలిస్టులు భారీగా హాజరు కావాలని కోరారు.  తమ సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజె) ఆఫీసులో అధ్యక్షుడు ఈ. చంద్రశేఖర్ అధ్యక్షతన సభ్యత్వ నమోదు ప్రారంభించారు. అనంతరం టీడబ్ల్యూజే ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పదకొండేళ్లుగా ఇండ్ల స్థలాల సమస్య పెండింగ్​లో ఉందని గుర్తు చేశారు. కరోనా కాలంలో 100 మంది వరకు చనిపోయిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. రాంచందర్, హెచ్ యూ జే ఉపాధ్యక్షుడు పద్మ రాజు, నాయకులు గండ్ర నవీన్,  దామోదర్, అచ్చిన ప్రశాంత్, పాండు, విజయానంద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.