హిందీ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ రూ.50 కోట్లు తీసుకుంటున్నారా..!

హిందీ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ రూ.50 కోట్లు తీసుకుంటున్నారా..!

ఆర్ఆర్ఆర్(RRR) సూపర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్(Ntr) క్రేజ్ గ్లోబల్ వైడ్ గా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఆయన తరువాతి సినిమాలపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala shiva)తో దేవర(Devara) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నేషనల్ వైడ్ గా ఉన్న సినిమా లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దేవర నుండి రిలీజైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేరుస్తున్నాయి. 

ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. హృతిక్ రోషన్(Hrithik roshan), టైగర్ ష్రాఫ్(Tiger shraf) ప్రధాన పాత్రల్లో వార్(War) సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు వార్ సినిమాకు సీక్వెల్ గా వార్2 తెరకెక్కిస్తున్నారు మేకర్స్. యాష్ రాజ్ ఫిల్మ్స్(Yash raj films) తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించనున్నారు.

ఈ సినిమా కోసం మొదటిసారి హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకొన్నాడు ఎన్టీఆర్. ఇదే విషయాన్నీ యాష్ రాజ్ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించేసింది. దీంతో ఈ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ALSO READ : ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ..మాకు చెప్పకుండా ఎలా చేస్తారండి..

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రూ.50 భారీ రెమ్యునరేషన్ ను తీసుకోనున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి బాలీవుడ్ ఎంట్రీ అంటేనే  అరుదు.. అలాంటిది మొదటి సినిమాకే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఒకరకంగా ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. ప్రభాస్ మినహా ఇప్పటివరకు ఏ సౌత్ హీరో కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ ను అందుకోలేదు. ఆ విషయంలో ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. మరి అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చుడాలి.