ఎన్టీఆర్ నెక్స్ మూవీ కొరటాలతో

ఎన్టీఆర్ నెక్స్ మూవీ కొరటాలతో

కొమురం భీమ్‌‌‌‌గా ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ అత్యద్బుతంగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ హడావుడి ముగిసింది. దాంతో ఎప్పుడెప్పుడు కొత్త చిత్రం షూటింగ్‌‌‌‌లో జాయినవుతాడా అని అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తారక్‌‌‌‌ వైపు నుంచే క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఇటీవల బాలీవుడ్‌‌‌‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. జూన్‌‌‌‌ ఫస్ట్ వీక్‌‌‌‌ నుంచి షూట్‌‌‌‌లో పాల్గొనబోతున్నట్టు చెప్పాడు. అతనికిది ముప్ఫయ్యో సినిమా. పైగా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రం తర్వాత వస్తూండటంతో అంచనాలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగా కాన్సెప్ట్‌‌‌‌తో పాటు తన మేకోవర్‌‌‌‌ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఆరు నుంచి ఎనిమిది కిలోల వరకు బరువు కూడా తగ్గబోతున్నాడట. ఆలియాభట్  హీరోయిన్‌‌‌‌గా నటించనున్నట్టు టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ చిత్రానికి అనురుధ్ సంగీతం అందించనున్నాడు. మరోవైపు ‘ఉప్పెన’ ఫేమ్‌‌‌‌ బుచ్చిబాబు డైరెక్షన్‌‌‌‌లోనూ ఎన్టీఆర్ ఓ సినిమా యాక్సెప్ట్ చేశాడు. అఫీషియ‌‌‌‌ల్ అనౌన్స్‌‌‌‌మెంట్ రావలసి ఉంది.