ధరణిలో లోపాల వల్లే రాష్ట్రంలో అల్లకల్లోలం

ధరణిలో లోపాల వల్లే రాష్ట్రంలో అల్లకల్లోలం

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మూడు హత్యలు ఆరు ఆత్మహత్యలు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ధరణి లోపాల వల్లే రాష్ట్రంలో అల్లకల్లోలం ఏర్పడుతోందని, భూ తగాదాలతో హత్యలు , ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు, ధరణి ఇతర అంశాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టిలతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు ఏమి కాలేదన్నారు. కొందరు ప్రభుత్వ అధికారులు సీఎం కేసీఆర్ కి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు.

‘కాళేశ్వరం ప్రయోజనం లేని ప్రాజెక్టు. ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే రూ 40 వేలు విద్యుత్ బిల్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. అలాంటి ప్రాజెక్టును ఎందుకు కట్టారు ? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో, లిక్కర్ కుంభకోణంలో కూడా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కాదు. రెండు ఒకటే. ఎన్నికల వరకు ఆ రెండు పార్టీలు హైప్ సృష్టిస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గాంధీ భవన్ లో ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారు’. అని తెలిపారు.