కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ కామెంట్ పై కమల్ వివరణ

కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ కామెంట్ పై కమల్ వివరణ

చెన్నై : మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు కమల్ హాసన్ పుల్వామా టెర్రర్ ఎటాక్ పై స్పందించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… రెండు దేశాల ప్రభుత్వాల తీరువల్లే జవాన్లు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. “సోల్జర్స్ అసలు ఎందుకు చనిపోవాలి? మన ఇంటి కాపలాదారు ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి?” అని ఆయన ప్రశ్నించారు.

భారత, పాకిస్థాన్ దేశాల్లోని ప్రభుత్వాలు సరిగా పనిచేస్తే జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉండదని కమల్ హాసన్ చెప్పారు. అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా కంట్రోల్ లో ఉంటుందని చెప్పారు. కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని చెప్పారు కమల్ హాసన్. భారత ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకోవాలని.. ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు.

కమల్ వివరణ

తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు రావడంతో.. కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. తమిళనాడుకు చెందిన అమరజవాన్ల కుటుంబాలను పరామర్శించిన కమల్… 3 దశాబ్దాల కిందట తాను ఓ మేగజీన్ కు రాసిన ఆర్టికల్ ను ప్రస్తావించానని చెప్పారు. మూడు దశాబ్దాల కిందట ఓ పాయింట్ ఆఫ్ టైమ్ లో కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరంపైనే మాట్లాడానని.. ఇప్పటి పరిస్థితులకు అది సరిపోల్చకూడదని విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ .. భారత్ లో ఎన్నటికీ అంతర్భాగమేనని అన్నారు. ఇదే తమ పార్టీ స్టాండ్ అని… తమ అభిప్రాయం సోషల్ మీడియాలో వక్రీకరించారని.. ప్రజలు గమనించాలని ఆయన పార్టీ కూడా కోరింది.