లైంగిక దాడులు, హత్యలు జరిగినా పర్వాలేదా?: దాడి ఘటనపై కంగనా ఫైర్

 లైంగిక దాడులు, హత్యలు జరిగినా పర్వాలేదా?: దాడి ఘటనపై కంగనా ఫైర్

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో  ఓ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కంగనా మద్దతుగా నిలవగా.. మరికొందరేమో కానిస్టేబులు సమర్థిస్తున్నారు. 

ఈ క్రమంలోనే దాడి ఘటనపై కంగనా మరోసారి మండిపడ్డారు. "లైంగిక దాడులకు పాల్పడినవాడు, హంతకుడు, దొంగ, ఇలా నేరం చేసిన వారు ఎవరైనా భావోద్వేగ, మానసిక, ఆర్థికపరమైన కారణాలు చెబుతుంటారు. కారణం లేకుండా ఏ నేరం జరగదు. అయినా సరే చేసిన నేరానికి వారిని దోషిగా తేల్చి శిక్ష విధిస్తారు. అలా కాదని చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ భావోద్వేగాలకు విలువిస్తే.. అనుమతి లేకుండా ఓ వ్యక్తి శరీరాన్ని తాకడం, వారిపై దాడి చేయడం వంటి ఘటనలను మీరు సమర్థిస్తే.. లైంగిక దాడులు, హత్యల వంటివి జరిగినా మీకేం పర్వాలేదనే అర్థం. మీ లాంటివారు మీ మానసిక పరిస్థితిపై మరింత దృష్టిపెట్టుకోవాలి. యోగా, ధ్యానం చేయండి. లేదంటే జీవితం చేదు అనుభవంగా మారుతుంది. పగ, ద్వేషం, అసూయతో ఉండకండి. వాటినుంచి ఇకనైనా విముక్తి పొందండి" అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.