ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసే ఎయిర్ హోస్టులు

ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసే ఎయిర్ హోస్టులు

 కరీనా కపూర్ ఖాన్‌‌‌‌, కృతిసనన్‌‌‌‌, టబు లీడ్ రోల్స్‌‌‌‌లో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘క్రూ’. రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో ఏక్తాకపూర్‌‌‌‌, రియాకపూర్ నిర్మిస్తున్నారు. మార్చి 29న సినిమా విడుదల కానుంది. కరీనా, కృతి, టటు పాత్రలను పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన వీరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఎయిర్ హోస్టెస్‌‌‌‌గా కనిపిస్తు న్న ఈ  ముగ్గురు చేస్తున్న అల్లరితో కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. 

ముగ్గురు అసంతృప్తిగా ఉండే  ఎయిర్ హోస్టెస్  జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలనుకుంటారు. దీనికోసం వీరు  విమానంలో  ఉండే  వస్తువులను దొంగిలించడం ఫన్‌‌‌‌ను జనరేట్ చేస్తుంది.  గ్లామర్ లుక్స్‌‌‌‌తో  ఈ ముగ్గురు ఆకట్టుకుంటున్నారు. ఇందులో టబు‌‌‌‌కు ప్రమాదం అని, కరీనాకు దొంగ అని, కృతి సనన్‌‌‌‌కు నకిలీ అని పోస్టర్స్‌‌‌‌కు క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.  పంజాబీ నటుడు దిల్జీజ్‌‌‌‌ దోసాంజ్‌‌‌‌, కపిల్ శర్మ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.