లండన్ వెళ్లేందుకు నవాజ్ షరీఫ్ కు అనుమతి

లండన్ వెళ్లేందుకు నవాజ్ షరీఫ్ కు అనుమతి

అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఊరట లభించింది. వైద్య చికిత్స కోసం ఆయన లండన్ వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. నాలుగు వారాల పాటు ఆయనకు బెయిల్ ను మంజూరు చేస్తున్నామని, ఈలోగా  ట్రీట్ మెంట్ చేయించచుకుని తిరిగి స్వదేశానికి రావాలని కోర్టు నిబంధన విధించింది. విదేశాలకు వెళ్లకుండా నిషేదం విధించిన వ్యక్తుల జాబితా నుంచి షరీఫ్ పేరును తొలగించాలని ఇమ్రాన్ సర్కారును కోర్టు ఆదేశించింది.

డాక్టర్ల సలహాతో ఈ గడువును మరికొంత కాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని నవాజ్ తరఫు న్యాయవాది తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో నవాజ్ షరీఫ్, లండన్ కు బయలుదేరి వెళతారన్నారు.