సన్నబియ్యం పథకం క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ్టి(మార్చి 30)తో సన్నబియ్యం పంపిణీ పథకానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కలిసి లంచ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్..సన్నబియ్యం ఆలోచన రేవంత్ రెడ్డిదేనన్నారు. రూ. 14560 కోట్లు సన్నబియ్యం కోసం ఖర్చుచేశామని చెప్పారు.ఇపుడు పేదలు కడుపునిండా తింటున్నారనిఅన్నారు. 86 శాతం మంది జనాలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఫుడ్ సెక్యూరిటీ చట్టానికి తెలంగాణలో న్యాయం చేస్తామన్నారు. ఎంత ఖర్చైనా సన్నబియ్యం పథకం కొనసాగిస్తామని తెలిపారు.
రైతుల ఖాతాలో ఇప్పటి వరకు రూ. 40 వేల కోట్లు వేశామన్నారు ఉత్తమ్. ధాన్యం డబ్బులు 48 గంటల్లో రైతులకువేస్తున్నామని తెలిపారు.అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నామన్నారు.
