32 మంది మహిళా ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఫుల్ పెన్షన్

 32 మంది మహిళా ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఫుల్ పెన్షన్

32 మంది మాజీ మహిళా ఎయిర్ ఫోర్స్ అధికారులు న్యాయ పోరాటంలో ఎట్టకేలకు గెలిచారు.  షార్ట్ సర్వీస్ కమిషన్ లో భాగంగా వారు కేవలం ఐదేళ్ల పాటు మాత్రమే ఉద్యోగంలో కొనసాగినప్పటికీ.. పూర్తి స్థాయి పెన్షన్ కు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్లు 20 ఏళ్లపాటు పనిచేయకున్నా.. పని చేసినట్టేనని వ్యాఖ్యానించింది. అందుకే వాళ్లకు పూర్తి స్థాయి పెన్షన్ ను మంజూరు చేయాలని ఆదేశాలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది. 

ఈ 32 మంది మహిళలను షార్ట్ సర్వీస్ కమిషన్ లో భాగంగా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అనంతరం ఐదేళ్ల పాటు ఎయిర్ ఫోర్స్ లో సేవలు అందించారు. అయితే వారు తమ ఉద్యోగ కాల పరిమితిని పెంచాలని తొలుత సంస్థాగతంగా  పోరాటం చేస్తూ వచ్చారు.  ఎంతకూ తమ మాటను వినేవారు లేకపోవడంతో దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాళ్లు షార్ట్ సర్వీస్ కమిషన్ (ఐదేళ్ల ఉద్యోగ కాలపరిమితి)ను  పూర్తి చేసుకున్న 12 ఏళ్ల తర్వాత హైకోర్టు తాజా ఆదేశాలను జారీచేసింది. వయసు మించిపోయినందున వాళ్లను మళ్లీ సర్వీసులోకి తీసుకోలేమని.. ఇందుకు ప్రతిఫలంగా వారిని పూర్తి స్థాయి పెన్షన్ పొందే అర్హతను కల్పిస్తున్నామని న్యాయస్థానం వెల్లడించింది.