ఇద్దరి కోసం మనుషులంతా ఒక్కటయ్యారు

ఇద్దరి కోసం మనుషులంతా ఒక్కటయ్యారు

మనిషితో ఓ మనిషి సంబంధం లేకుండా గజిబిజి జీవనం గడుపుతున్న ఈ నాగరిక ప్రపంచంలో..  ఓ ఇద్దరి వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు ఆ ఊరి జనమంతా ఒకటయ్యారు.

మధ్యప్రదేశ్  ఇండోర్ లోని గౌతమ్ పురలో ఇద్దరు వ్యక్తులు ఓ నది ప్రవాహంలో చిక్కుకుపోయారు.  వారిని కాపాడేందుకు ఆ గ్రామస్తులంతా ఏకమై మానవ హరంగా ఆ ప్రవాహానికి అడ్డు నిలిచారు. వారంతా ఒకరి చేయి మరొకరు పట్టుకొని  ఆ నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. ఆ ఇద్దరిలో ఒకరిని కాపాడగా.. మరొకరి కాపాడేందుకు  ఇంకా తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు.

Locals in Indore's Gautampura form human chain to rescue two people who were washed away in an overflowing stream.