కాంగ్రెస్‌‌ ప్రచార కమిటీ చైర్మన్‌‌గా మధుయాష్కీ.. కో చైర్మన్‌‌గా పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

కాంగ్రెస్‌‌ ప్రచార కమిటీ చైర్మన్‌‌గా మధుయాష్కీ..  కో చైర్మన్‌‌గా పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

    
హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రచార కమిటీతోపాటు రాష్ట్రంలోని17 లోక్ సభ స్థానాలకు ఎన్నికల అబ్జర్వర్లను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌ ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌‌గా మధుయాష్కీ, కో చైర్మన్‌‌గా పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, కన్వీనర్​గా సయ్యద్‌‌ అహ్మతుల్లా హుస్సేన్ నియమితులయ్యారు. 

ఎగ్జిక్యూటివ్‌‌ కమిటీ సభ్యులుగా కుసుమ కుమార్‌‌, మాజీ కార్పొరేటర్‌‌ ప్రవీణ్‌‌రెడ్డి,  కత్తి కార్తీక గౌడ్‌‌,  మహ్మద్‌‌ జావీద్‌‌ అక్రం, మణికొండ మున్సిపల్‌‌ చైర్మన్‌‌ నరేందర్‌‌ ముదిరాజ్‌‌, సర్పంచ్‌‌ జూలురు ధనలక్ష్మీ, దయాకర్‌‌గౌడ్‌‌, వరంగల్‌‌ రవి, హుజూర్‌‌నగర్‌‌ మార్కెట్‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌ నాగన్న, అముగోత్‌‌ వెంకటేశ్, జెడ్పీటీసీలు రాములు యాదవ్‌‌,  దాస్‌‌ గౌడ్‌‌,  కెప్టెన్‌‌ కరుణాకర్‌‌రెడ్డి, గడుగు రోహిత్‌‌, బండ శంకర్‌‌, కోలా వెంకటేశ్, దినేశ్ సాగర్‌‌ ముదిరాజ్‌‌, గోపాల్‌‌రెడ్డి, దండెం రామ్‌‌రెడ్డి, మాజీ ప్యాక్స్‌‌ చైర్మన్‌‌ సిరికొండ మల్లేశ్, కోట శ్రీనివాస్‌‌ను నియమిస్తూ వేణుగోపాల్‌‌ ఉత్తర్వులు ఇచ్చారు.

అబ్జర్వర్లు వీళ్లే..

అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు 17 లోక్ సభ స్థానాలకు అబ్జర్వర్లను కూడా ఏఐసీసీ నియమించింది. ఆదిలాబాద్​కు ప్రకాశ్​రాథోడ్, భువనగిరికి శ్రీనివాస్​మానే, చేవెళ్లకు అల్లం ప్రభు పాటిల్, హైదరాబాద్​కు ప్రసాద్​అబ్బయ్య, కరీంనగర్​కు క్రిస్టోఫర్​తిలక్, ఖమ్మంకు ఆరిఫ్​నసీం ఖాన్, మహబూబాబాద్​కు పీటీ. పరమేశ్వర్​నాయక్, మహబూబ్​నగర్​కు మోహన్​కుమార మంగళం నియమితులయ్యారు. 

మల్కాజిగిరికి రిజ్వాన్​అర్షద్, మెదక్​కు బసవరాజ్ మాధవరావ్​పాటిల్, నాగర్​కర్నూల్​కు పీవీ.మోహన్, నల్గొండకు అజయ్​ధరమ్​సింగ్, నారాయణ్​ఖేడ్​కు సీడీ.మేయప్పన్, నిజామాబాద్​కు బీఎం. నాగరాజ్, పెద్దపల్లికి విజయ్ నామ్​దేవరావ్​వాడేట్టివర్, సికింద్రాబాద్​కు రూబీ ఆర్.మనోహరన్, వరంగల్​కు రవీంద్ర ఉత్తమ్​రావ్​ దల్వీలను అబ్జర్వర్లుగా నియమించారు.